![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -448 లో.......రామరాజుకి నర్మద కాఫీ తీసుకొని వస్తుంది. నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా మావయ్య అని అడుగుతుంది. అదేం లేదమ్మ అని రామరాజు అంటాడు. అమూల్య అప్పుడే కాలేజీకి వెళ్తుంటే.. అమూల్య నువ్వు మీ అమ్మ వచ్చేవరకు ఎక్కడికి వెళ్ళకు ఇంట్లో పనులు ఉంటాయి కదా అని రామరాజు అంటాడు. పర్వాలేదు మావయ్య వెళ్లనివ్వండి నేను చూసుకుంటానని నర్మద అంటుంది. నీ పనులు మానుకొని అవసరం లేదమ్మ అని రామరాజు అంటాడు. దాంతో నర్మద బాధపడుతుంది.ఇప్పుడు శ్రీవల్లి ఉంటే ఒంటి చేత్తో అన్ని పనులు చేసేదని తిరుపతి అంటాడు.
అప్పుడే చందు వచ్చి.. నాన్న నేను మిల్ కి వెళ్తున్నానని అంటాడు. నువ్వు మీ అత్తయ్యని చూసి శ్రీవల్లిని ఇంటికి తీసుకొనిరా అని రామరాజు అంటాడు. వద్దులే నాన్న అని చందు అంటాడు. ఏంట్రా వల్లి గురించి తీస్తేనే చిరాకుపడుతున్నావని రామరాజు అంటాడు. దాంతో ధీరజ్ కవర్ చేస్తాడు. నేను మిల్ కి వెళ్తున్నానని చందు చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మనమైనా వల్లి వాళ్ళ అమ్మని చూసి వద్దామని ధీరజ్ తో రామరాజు అంటాడు. మీరు రండీ వదిన అక్కడ తేల్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయని నర్మదతో ధీరజ్ అంటాడు. మరొకవైపు వల్లి కాలుకి దెబ్బలు తగిలినట్లు యాక్టింగ్ చేస్తే అల్లుడు గారు వచ్చి తనని తీసుకొని వెళ్తారని భాగ్యం అంటుంది. అవసరం లేదు ఇప్పటివరకు చేసింది చాలు అని వల్లి అంటుంది.
రామరాజు వాళ్ళు రావడం గమనించి భాగ్యం వెళ్లి కాలుకి దెబ్బలు తగిలినట్లు యాక్టింగ్ చేస్తుంది. రామరాజు వాళ్ళు వచ్చి.. ఇప్పుడు ఎలా ఉంది అమ్మ అని అడుగుతారు. కాలు తీసి కింద పెట్టలేకపోతుందని ఆనందరావు అంటాడు. అయ్యో అవునా బాగైందేమో వల్లిని తీసుకొని వెళదామనుకున్నానని రామరాజు అనగానే మావయ్య గారు నేను వచ్చేస్తానని వల్లి అంటుంది. అలా ఎలా వస్తావ్ అక్క అని నర్మద, ప్రేమ అంటారు. కాసేపటికి రామరాజు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అత్త ఇది కేరళ వైద్యం అని ఒక కర్రతో కొడుతాడు ధీరజ్ . ఇప్పుడు నొప్పి ఉంటే మీకు దెబ్బలు తగలనట్లు, నొప్పి లేకపోతే దెబ్బలు తగిలినట్లు అని ధీరజ్ అంటాడు. తర్వాత కర్రతో నర్మద కొడుతుంది. నొప్పి ఉన్నా భాగ్యం సైలెంట్ గా ఉంటుంది. ఎక్కడ యాక్టింగ్ అని తెలుస్తుందోనని భయపడుతుంది. తరువాయి భాగంలో ప్రేమ వంక ధీరజ్ చూస్తుంటాడు. తను గిఫ్ట్ ఇచ్చింది విసిరేసినది గుర్తుచేసుకొని ఆ గిఫ్ట్ ని అతికించి ప్రేమకి సర్ ప్రైజ్ ఇస్తాడు ధీరజ్. దాంతో ప్రేమ తనని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |